రెండు సినిమాల‌ని ఒకేసారి ట్రాక్‌పైకి తెస్తున్న వెంకీ

Thu,June 7, 2018 10:21 AM
two movies goes on to the sets at a time

విక్టరీ వెంక‌టేష్ త‌న సినిమాల స్పీడ్ పెంచాడు. గురు చిత్రం త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న వెంకీ త్వ‌ర‌లో రెండు మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్స్ చేయ‌నున్నాడు. వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్ 2 అనే సినిమా చేయ‌నున్నాడు. వ‌చ్చే నెల‌లో ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంతో పాటు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాన్ని చేయ‌నున్నాడు . ఇందులో నాగ చైత‌న్య త‌న మామ‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. వెంకీ మామ అనే టైటిల్ ఈ చిత్రానికి ప‌రిశీలిస్తున్నారు.

ఇటు అనీల్ రావిపూడి చిత్రం అటు బాబీ చిత్ర షూటింగ్‌ల‌లో ఏక‌కాలంలో పాల్గొన‌నున్న వెంకీ, ఈ సినిమాల‌ని కూడా ఒకే సారి విడుద‌ల చేస్తాడా అనే డౌట్ అభిమానుల‌లో క‌లుగుతుంది. త్వ‌ర‌లో తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఆట నాదే వేట నాదే అనే సినిమా చేయ‌నున్నాడు. వీటితో పాటు ప‌లు క‌థ‌లని ఓకే చేసిన వెంకీ వీలైనంత తొంద‌ర‌గా వాటిని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడ‌ని అంటున్నారు. ఒక‌ప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాల‌తో అల‌రించే వెంకీ , నాలుగేళ్లుగా కాస్త స్పీడ్ త‌గ్గించాడు. కాని ప్ర‌స్తుతం వెంకీ లిస్ట్‌లో ఉన్న సినిమాల‌ని చూస్తుంటే మ‌ళ్లీ ఆ స్పీడ్ అందుకున్నాడేమో అనిపిస్తుంది.

1676
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles