జెర్సీలో నాని స‌ర‌స‌న ఇద్దరు భామ‌లు

Sat,October 13, 2018 01:40 PM
two heroines pair with nani

నేచుర‌ల్ స్టార్ నాని రీసెంట్‌గా దేవ‌దాస్ అనే చిత్రంతో మంచి హిట్ కొట్ట‌గా , త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌ముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో జెర్సీ అనే టైటిల్‌తో చేస్తున్నాడు . మ‌ళ్ళీ రావాఫేం గౌత‌మ్ తిన్న‌మూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది . క‌ల‌ని అందుకోవాలంటే ఆల‌స్యం చేయోద్దు అని జెర్సీకి ట్యాగ్ లైన్‌గా ఉంచారు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈచిత్రం లో అర్జున్ పాత్రలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం నాని రోజుకు 3గంటలు క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్నాడట. క్రికెట‌ర్‌గానే కాదు పెళ్ల‌యిన న‌డివ‌య‌స్కుడు, ముస‌లి వ్య‌క్తిగా కూడా నాని ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడ‌ని చెబుతున్నారు. నాని మూడు పాత్ర‌ల‌ని ఛాలెంజ్‌గా తీసుకొని న‌టిస్తున్నాడ‌ని చెబుతున్నారు.

అయితే పీరియాడిక్ చిత్రంలో నాని స‌ర‌స‌న ఇద్ద‌రు భామ‌లు న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కన్నడలో యూటర్న్‌ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌తో పాటు మ‌ల‌యాళ న‌టి రెబ్బా మోనికా జాన్ మ‌రో హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ట‌. మలయాళం, తమిళంతో కలిపి నాలుగు సినిమాల్లో నటించిన మోనిక ‘జెర్సీ’ సినిమా ద్వారా తెలుగులో పరిచయం కానున్నారు. ఈ నెల 18న లాంచింగ్ కానున్న ఈ చిత్రం చివరి వారంలో రెగ్యులర్‌ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

3136
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles