అక్ష‌య్ కుమార్ భార్య చేసిన ప‌ని చూస్తే షాకే..!

Sat,August 19, 2017 03:33 PM
Twinkle Khanna shares a pic quite intresting

సామాజిక అంశాల‌ను క‌థ‌లుగా మార్చి సినిమాలు తీయ‌డంలో అక్ష‌య్ ముందుంటాడు. 2015లో బేబీ చిత్రంతో దేశభక్తిని చాటిన అక్షయ్ రీసెంట్ గా టాయ్‌లెట్ -ఎక్ ప్రేమ్‌కథ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఆయ‌న చేస్తున్న ప్యాడ్‌మెన్, గోల్డ్ చిత్రాలు సైతం సందేశాత్మక చిత్రాలే కావడం గమనార్హం. అయితే ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ స్వ‌చ్ఛ‌భార‌త్ అభియాన్ నుంచి స్ఫూర్తి పొంది టాయిలెట్ ఏక్ ప్రేమ్ క‌థా అనే చిత్రాన్ని చేశారు అక్ష‌య్ . శ్రీ నారాయణ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అక్ష‌య్ స‌ర‌స‌న భూమి ప‌డ్నేక‌ర్ క‌థానాయిక‌గా న‌టించింది. టాయిలెట్ సౌక‌ర్యం లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయ‌నేది ఈ సినిమాలో చూపించారు.

మౌనాన్ని ఛేదించే ప్రయత్నంలో భాగంగా టాయ్‌లెట్ -ఎక్ ప్రేమ్‌కథ సినిమా చేశారు అక్ష‌య్. పూర్తి సందేశాత్మ‌క చిత్రంగానే కాక వినోదోత్మ‌కంగా ఈ మూవీ ఉండ‌డంతో ప్రేక్ష‌కులు ఈ సినిమాకి నీరాజ‌నాలు ప‌లికారు. ప్ర‌స్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. ఈ చిత్రాన్ని స్పూర్తిగా తీసుకొని కొంద‌రు టాయిలెట్స్ కూడా నిర్మించుకున్నారు . ఇలాంటి మంచి చిత్రం తీసిన టాయ్‌లెట్ -ఎక్ ప్రేమ్‌కథ చిత్ర యూనిట్ అంద‌రికి ప్ర‌ధాని మోదీ అభినంద‌నలు తెలియ‌జేశారు. క‌ట్ చేస్తే అక్ష‌య్ భార్య ట్వింకిల్ ఖ‌న్నా స‌ముద్రం ఒడ్డున బ‌హిర్భూమికి వెళుతున్న వ్య‌క్తిని త‌న కెమెరాలో బంధించి ఆ ఫోటోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ టాయ్‌లెట్ -ఎక్ ప్రేమ్‌కథ చిత్రం పార్ట్ 2లో తొలి సీన్ ఇక్క‌డ‌దే అయి ఉండొచ్చు అనే కామెంట్ పెట్టింది. అంటే తన దృష్టిలో టాయ్‌లెట్ .. ఎక్ ప్రేమ్‌కథకి సీక్వెల్ తీసి ప్ర‌జ‌ల‌లో మ‌రికొంత చైత‌న్యం తేవాల‌ని ఆమె కోరుకుంటుంద‌నుకుంట‌.


5505
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles