హైట్‌పై కామెంట్‌.. అభిమానులు శాంతించాల‌ని కోరిన సూర్య‌

Sun,January 21, 2018 11:28 AM
TV anchors make fun of Suriya height on show

ఈ మ‌ధ్య కాలంలో కొన్ని టీవి ఛానెల్స్ స్టార్ హీరోస్‌ని టార్గెట్ చేసుకొని రేటింగ్స్ పెంచుకోవాలని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ త‌ర‌హాలో సన్ టీవీ మ్యూజిక్ ఛానల్ లో ఇద్దరు యాంకర్లు కాస్త‌ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి సూర్య హైట్‌పై కామెంట్ చేశారు. దీనిపై ఆగ్ర‌హించిన అభిమానులు స‌న్ టీవి ఆఫీసు ఎదురుగా ధ‌ర్నా చేసినంత ప‌ని చేశారు. అస‌లు మేట‌ర్‌లోకి వెళితే స‌న్‌టీవి ఛానెల్ యాంక‌ర్స్ రీసెంట్‌గా ఓ ప్రోగ్రాంలో సూర్య‌ హైట్ తక్కువని, అత‌ని సినిమాలో అమితాబ్ నటిస్తే స్టూల్ వేసుకుని నిలబడాల్సి వస్తుందని వెట‌కార‌పు కామెంట్స్ చేశారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. అభిమానులు ఆందోళ‌న చేయాల‌ని భావించ‌గా, సూర్య త‌న అభిమానుల‌కి మెసేజ్ ఇచ్చారు. ఇలాంటి వాటిలో తల దూర్చడం నాకు ఇష్టం ఉండ‌దు. ఏదైనా ప్రయోజనం కూడిన పనుల్లో భాగం అవ్వండి అని అన్నాడు. దీంతో ఫ్యాన్స్ కొంత శాంతించారు. కోలీవుడ్‌కి చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలు యాంక‌ర్ల కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు. న‌డిఘ‌ర్ సంఘం అయితే ఏకంగా స‌న్ యాజ‌మాన్యానికి నోటీసులు పంపింది. ఒక స్టార్ హీరో పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ , వీటికి బాధ్యత వహిస్తూ వివరణ ఇవ్వాల్సిందిగా అందులో పేర్కొంది. హీరో విశాల్ కూడా ప్రేక్ష‌కుల‌ని న‌వ్వించ‌డం కోసం ఇలాంటి కామెంట్స్ చేయ‌డం అస్స‌లు క‌రెక్ట్ కాదంటూ అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు.

2477
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS