ప్రముఖ నటి, యాంకర్ మల్లిక మృతి

Mon,October 9, 2017 05:10 PM


బెంగళూరు: ప్రముఖ టీవీ నటి, యాంకర్ మల్లిక (39) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లిక.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 20 రోజులుగా కోమాలోనే ఉన్నారు. ఆమె అసలు పేరు అభినవ. టీవీ నటిగా, యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె తొలిసారి మహేశ్‌బాబు నటించిన రాజకుమారుడు సినిమాలో కనిపించారు. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా నటించిన పంచదార చిలుక తోపాటు మరో రెండో సినిమాల్లో నటించారు. మల్లిక 1997-2004 లలో ఉత్తమ యాంకర్ అవార్డును కూడా అందుకున్నారు. మల్లిక భౌతిక కాయాన్ని రేపు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.

8841
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles