మరో 5 రోజుల్లో సల్మాన్ మూవీ టీజర్

Sat,April 29, 2017 03:08 PM
Tubelight Teaser To Arrive On may

భజరంగీ బాయిజాన్, సుల్తాన్ చిత్రాలతో అలరించిన సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కబీర్‌ఖాన్ దర్శకత్వంలో ట్యూబ్ లైట్ అనే చిత్రం చేస్తున్నాడు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసి ఫ్యాన్స్ లో భారీ హైప్స్ పెంచారు మూవీ మేకర్స్. ఈద్ కానుకగా ఏప్రిల్ 27న విడుదల కానున్న ట్యూబ్ లైట్ చిత్రానికి సంబంధించి జోరుగానే ప్రమోషన్స్ జోరుగుతున్నాయి. ఇప్పటికే రెండు పోస్టర్ లు విడుదల చేసిన చిత్ర యూనిట్ మే 3న మూవీ టీజర్ విడుదల చేస్తున్నట్టు ట్విట్టర్ లో తెలిపింది. ఇక ట్రైలర్ ని మే నెలాఖరుకు విడుదల చేయనున్నట్టు సమాచారం. ట్యూబ్ లైట్ మూవీలో చైనీస్ హీరోయిన్ జూ జూ సల్మాన్‌కు జోడీగా నటిస్తుంది. ఇప్పటికే సల్మాన్, కబీర్ కాంబినేషన్ లో వచ్చిన భజరంగీభాయ్ జాన్, ఏక్తా టైగర్ చిత్రాలు బాక్సాపీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. దీంతో ట్యూబ్ లైట్ మూవీపై కూడా భారీ అంచనాలు పెరిగాయి.


739
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS