మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్న సల్మాన్ మూవీ సాంగ్

Wed,May 17, 2017 12:30 PM
Tubelight - RADIO SONG

సల్మాన్ ఖాన్- కబీర్‌ఖాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ట్యూబ్ లైట్. జూన్ 25న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీ పై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా చిత్రంలోని ఫస్ట్ సాంగ్ రేడియో అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ అభిమానులను ఎంతగానో అలరిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లోని అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్ చిత్రీకరించారు. రేడియో అనే పాటకి అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ అందించగా, కమాల్ ఖాన్ మరియు అమిత్ మిశ్రా పాట పాడారు. ప్రీతమ్ చక్రవర్తి చిత్రానికి సంగీతం అందించారు. ట్యూబ్ లైట్ మూవీలో చైనీస్ హీరోయిన్ జూ జూ సల్మాన్‌కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన తొలి సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి

1036
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS