ట్యూబ్ లైట్ లో సల్లూ భాయ్ ఇలా

Thu,April 20, 2017 02:36 PM
TUBELIGHT new poster

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కబీర్‌ఖాన్ దర్శకత్వంలో ట్యూబ్ లైట్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ అంటూ ఓ పోస్టర్ విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇందులో సల్మాన్ ఖాన్ ని బ్యాక్ లుక్ లో మాత్రమే చూపించిన చిత్ర యూనిట్, తాజాగా మరో పోస్టర్ విడుదల చేసి ఫ్యాన్స్ లో జోష్ పెంచారు. ఇందులో సల్మాన్ తన రెండు షూస్ ని లేస్ తో కట్టుకొని మెడలో వేసుకున్నాడు. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈద్ కానుకగా ఏప్రిల్ 27న విడుదల కానున్న ట్యూబ్ లైట్ చిత్ర ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే రెండు పోస్టర్ లు విడుదల చేసిన చిత్ర యూనిట్ నెలాఖరుకి టీజర్ ని విడుదల చేసి, మేలో ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ఈ మూవీలో చైనీస్ హీరోయిన్ జూ జూ సల్మాన్‌కు జోడీగా నటిస్తుంది. ఇప్పటికే సల్మాన్, కబీర్ కాంబినేషన్ లో వచ్చిన భజరంగీభాయ్ జాన్, ఏక్తా టైగర్ చిత్రాలు బాక్సాపీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. దీంతో ట్యూబ్ లైట్ మూవీపై కూడా భారీ అంచనాలు పెరిగాయి.


907
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS