వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు కేటీఆర్

Thu,December 27, 2018 11:50 PM
TRS working president KTR attend vinaya vidheya rama pre release function

వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ స్వయంకృషితో తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు భారత చిత్రసీమలో దిగ్గజంగా, మహానటుడిగా నిలిచారు చిరంజీవి. సముద్రమంతా అభిమానాన్ని, అద్భుతమైన వారసుల్ని ఇండస్ట్రీకి అందించారు. మేము ఎన్నికల్లో మాట్లాడిన దానికంటే ఈ వేదికపై చరణ్ అద్భుతంగా ప్రసంగించాడు. ఈ మధ్యకాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు చరణ్. రంగస్థలం చిత్రీకరణలో ఉండగా చరణ్‌ను కలిశాను. గడ్డంతో కనిపించిన అతడిని చూసి ఏ సినిమా చేస్తున్నావని అడిగాను. గ్రామీణ నేపథ్య కథాంశంలో నటిస్తున్నానని అన్నాడు. అర్భన్ సెన్సిబిలిటీస్ చరణ్‌లో ఎక్కువగా ఉంటాయి. అలాంటిది పల్లెటూరి చిత్రం చేస్తున్నానని చెప్పగానే సినిమా చూడనని అన్నాను. కానీ మా స్నేహితులంతా సినిమా అద్భుతంగా ఉందని చెప్పారు. చరణ్ కెరీర్‌లోనే అద్భుతమైన అభినయాన్ని కనబరిచిన సినిమా రంగస్థలం. ఈ మాట మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఎన్నికల సమయంలో నా ప్రతి ప్రసంగంలో ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అంటూ ఈ సినిమాను వాడుకున్నాను.

తెలంగాణ నాగన్నలు, రాజన్నలు తమకు ఏం కావాలో తేల్చుకున్నారు. మమ్మల్ని నిలబెట్టారు.సాధారణంగా నేను యాక్షన్ జోనర్ సినిమాలు చూడను. కానీ దర్శకుడు బోయపాటి శ్రీను కోసం ఈ సినిమా చూడాలని అనుకుంటున్నాను. మెగా అభిమానులకు ఈ సినిమా పండుగలా ఉంటుంది.సినిమాలో వినయవిధేయ రామ ఎవరూ అని చిరంజీవిని అడిగాను. ట్రైలర్ చూస్తే తెలుస్తుందని ఆయన అన్నారు. ట్రైలర్‌లో రామ్‌చరణ్ విధ్వంసరాముడిగానే కనిపిస్తున్నారు చిరంజీవి నుంచి సంస్కారాన్ని వినయాన్ని విధేయాన్ని అలవర్చుకున్నారు చరణ్. ఇండస్ట్రీలో అద్భుతమైన శక్తిగా ఎదుగుతున్నారు. పవన్‌కల్యాణ్‌తో ఈ మధ్యనే రెండు, మూడు సార్లు మాట్లాడాను. రాజకీయాలతో పాటు ఆయన సినిమా ప్రస్థానం విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

రామ్‌చరణ్ మాట్లాడుతూ నా ఆప్త మిత్రుడు, గ్రేట్ టీడర్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రియమైన నాయకుడు కేటీఆర్ ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. కేటీఆర్ పనితీరు, కేసీఆర్ విజన్‌ను ముందుకు తీసుకెళ్లాలనే ఆయన తపన, కష్టపడేతత్వం, ప్రజాసేవ చేయాలన్న ఆకాంక్ష మా అందరికి స్ఫూర్తినిస్తున్నాయి.. తాజా ఎన్నికల్లో గొప్ప విజయాన్ని సాధించిన మీకు మా మెగా అభిమానులు అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నన్నారు.

1976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles