అదే ట్రెండ్ కొనసాగించనున్న త్రివిక్రమ్..!

Mon,March 18, 2019 03:51 PM
Trivikram to Continue Father,son Bond in Bunny movie


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 8 నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. త్రివిక్రమ్, బన్నీ కలయికలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు బాక్సాపీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్నాయి. ఈ రెండు చిత్రాల్లో తండ్రీ కొడుకుల అనుబంధాన్ని చక్కగా చూపించాడు త్రివిక్రమ్. అయితే తాజాగా వస్తున్న కొత్త ప్రాజెక్టుకు కూడా త్రివిక్రమ్ ఇదే ట్రెండ్‌ను కొనసాగించనున్నాడట. ఈ చిత్రంలో కూడా తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని చూపించనున్నట్లు టాక్. అంతేకాకుండా ఈ సినిమాకు నాన్న-నేను అనే టైటిల్ పెట్టాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

అల్లు అరవింద్‌, రాధాకృష్ణ.. గీతా ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని బేన‌ర్‌ల‌పై ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. త్రివిక్ర‌మ్ఈ చిత్రంలో బ‌న్నీని స‌రికొత్త లుక్‌లో చూపించ‌నున్నాడు. థ‌మ‌న్ బాణీలు స‌మ‌కూర్చ‌నున్నాడు. క‌థానాయిక‌లుగా ర‌ష్మిక మంథాన‌, పూజా హెగ్డే, కేథ‌రిన్‌ల‌లో ఒక‌రిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంద‌ని విశ్వనీయ వర్గాల స‌మాచారం.

1529
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles