శ్రీవారిని దర్శించుకున్న దర్శకుడు త్రివిక్రమ్

Thu,November 1, 2018 01:05 PM
Trivikram Srinivas visits Tirumala

తిరుమల : తిరుమల శ్రీవారిని మాటల మాంత్రికుడు, సినీ దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామసమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు త్రివిక్రమ్ కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అరవిందసమేత చిత్రం విజయవంతం అయిన సందర్భంగా స్వామివారికి మ్రొక్కులు చెల్లించుకోవడానికి తిరుమలకు వచ్చినట్లు త్రివిక్రమ్ పేర్కొన్నారు.

2014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles