త్రిష‌కి షాక్ ఇచ్చిన హ్యాక‌ర్స్

Sun,October 21, 2018 10:20 AM
trisha twitter account hacked

ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీల సోష‌ల్ మీడియాకి సంబంధించిన ఎకౌంట్స్ హ్యాక్ కావ‌డం కామ‌న్‌గా మారింది. హ్యాక్ చేసిన హ్యాక‌ర్స్ వారి గురించి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తుండ‌గా, వీరు గ‌గ్గోలు పెడుతున్నారు. తాజాగా చెన్నై చంద్రం త్రిష ట్విట్ట‌ర్ ఎకౌంట్ హ్యాక్ అయింద‌ట‌. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపిన త్రిష త‌న పాస్‌వ‌ర్డ్ మార్చిన‌ట్టు తెలిపింది. అంతేకాదు త‌న అభిమానులెవ‌రు మెసేజ్‌లు పంపొద్ద‌ని కోరింది. త‌న పేరుతో పోస్ట్ అయిన విష‌యాలు కూడా ప‌ట్టించుకోవొద్దని తెలిపింది . ర‌జనీకాంత్ స‌ర‌స‌న పేటా చిత్రంలో న‌టిస్తున్న త్రిష కొద్ది రోజులుగా వార‌ణాసిలో ఉంది. శ‌నివారం త‌న ఎకౌంట్ హ్యాక్ అయిన‌ట్టు తెలుసుకుంది. ఎవ‌రో త‌న ఎకౌంట్ ద్వారా త‌ప్పుడు స‌మాచారం పంపిస్తున్నార‌ని ఈ అమ్మ‌డు తెలుసుకుంద‌ట‌. గ‌తంలోను త్రిష ట్విట్ట‌ర్ ఎకౌంట్ హ్యాక్ అయిన సంగ‌తి తెలిసిందే

4413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles