చిరు సినిమాకు హీరోయిన్ ఖరారు..!

Sun,December 15, 2019 06:53 PM


కొరటాల శివ-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రంలో హీరోయిన్ ఎవరనే అంశంపై పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో చిరుకు జోడీగా నటించే వారిలో అనుష్క, నయనతార, కాజల్, త్రిష పేర్లు వినిపిస్తూ వచ్చాయి. అయితే చిరు హీరోయిన్ ఎవరనేది క్లారిటీ వచ్చింది. ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా త్రిష పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది త్రిష చేయబోయే 3 సినిమాల గురించి ట్వీట్ చేశాడు. ఇందులో చిరు-కొరటాల శివ సినిమా కూడా ఉంది. దీనికి త్రిష #2020 ట్యాగ్ జత చేస్తూ విక్టరీ ఎమోజీని పోస్ట్ చేసింది. త్రిష స్పందించడంతో చిరు సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లేనని స్పష్టమవుతోంది. అయితే దర్శక, నిర్మాతల నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సింది ఉంది. త్రిష, చిరు కాంబోలో ఇప్పటికే స్టాలిన్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.

2398
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles