ఫోటో లీక్ కావ‌డంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన త్రిష‌

Sun,August 20, 2017 03:24 PM
trisha request to her fans dont share pics in social media

చెన్నై సోయ‌గం త్రిష‌ ప్ర‌స్తుతం 96, 1818, గర్జానై అనే చిత్రాల‌తో బిజీగా ఉంది. 96 చిత్రం ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. త్రిష 59వ చిత్రంగా వస్తోన్న 96 మూవీపై అభిమానులలో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు కారణం ఈ చిత్రం 1996వ సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో తెరకెక్కి ఉండొచ్చనే టాక్ రావడమే. మద్రాస్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై నంద గోపాల్ నిర్మిస్తున్న ఈ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రానికి సంబంధించి ఓ స్టిల్ లీకైంది. మెచ్యుర్ లుక్ లో కనిపిస్తున్న త్రిష కాట‌న్ స‌ల్వార్ ధ‌రించి ఓ పాప‌తో ఉంది. ఈ స్టిల్ సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. ఈ స్టిల్ బ‌ట్టి త్రిష 96 మూవీలో స్కూల్ టీచ‌ర్ పాత్ర చేస్తుంద‌ని అంచ‌నాలు వేశారు. అయితే ఇది త‌న‌ దృష్టికి రావ‌డంతో సోష‌ల్ మీడియా ద్వారా అస‌హ‌నం వ్య‌క్తం చేసింది త్రిష . ఫ్యాన్స్ ని సంతోష ప‌ర‌చేందుకు వారితో ఫోటోలు దిగేందుకు నేను వెనుకాడ‌ను. కాని ద‌య‌చేసి షూటింగ్ టైంలో,సెట్స్ లో తీసిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేయోద్ద‌ని రిక్వెస్ట్ చేసింది. ద‌ర్శ‌కుడు న‌టీన‌టుల లుక్స్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి, వాటిని ఓ టైంలో రిలీజ్ చేయాల‌ని అనుకుంటాడు. కాని ఇంత‌లోనే సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసి ద‌ర్శ‌కుడిని అగౌర‌వ‌ప‌ర‌చొద్దు అని త్రిష ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ పాండిచ్చేరి ప‌రిస‌ర ప్రాంతాల‌లో జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. గోవింద్‌ మేనన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.4172
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles