స్కూల్ టీచ‌ర్ గా త్రిష‌..!

Sun,August 20, 2017 11:34 AM
trisha next to be school teacher in tamil

గ్లామరస్ బ్యూటీ త్రిష ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తోంది. ఈ మధ్య నాయకి, కోడి, మోహిని అనే చిత్రాలలో నటించి మెప్పించింది. ప్ర‌స్తుతం 96, 1818, గర్జానై అనే చిత్రాలలో నటిస్తున్నది. 96 చిత్రం ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. త్రిష 59వ చిత్రంగా వస్తోన్న 96 మూవీపై అభిమానులలో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు కారణం ఈ చిత్రం 1996వ సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో తెరకెక్కి ఉండొచ్చనే టాక్ రావడమే. మద్రాస్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై నంద గోపాల్ నిర్మిస్తున్న ఈ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రానికి సంబంధించి ఓ స్టిల్ విడుదలైంది. మెచ్యుర్ లుక్ లో కనిపిస్తున్న త్రిష కాట‌న్ స‌ల్వార్ ధ‌రించి ఓ పాప‌తో ఉంది. ఈ స్టిల్ సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. ఈ స్టిల్ బ‌ట్టి త్రిష 96 మూవీలో స్కూల్ టీచ‌ర్ పాత్ర చేస్తుంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ పాండిచ్చేరి ప‌రిస‌ర ప్రాంతాల‌లో జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. త్రిష న‌టిస్తున్న మ‌రో చిత్రం గర్జానై 2015లో ఎన్ హెచ్ 10 అనే హిందీ మూవీ రీమేక్ గా రూపొందుతుంది. సుందర్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష, వంశీ కృష్ణ, అమిత్ భార్గవ్, శ్రీ రంజని, వడివుక్కరసి, మధురై ముత్తు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

1484
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles