అనుకున్నదొక్కటి.. అయ్యింది ఒక్కటి !

Sat,September 22, 2018 10:19 AM
Trisha Krishnan in trouble

చెన్నై చంద్రం త్రిష ఏదో చేయబోతే .. ఏదో అయింది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మ‌డు ఇటీవ‌ల దుబాయ్‌కి వెళ్లింది. అక్క‌డ స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న డాల్ఫిన్స్‌తో తెగ విన్యాసాలు చేసింది. వాటికి ముద్దు పెడుతూ, తాను వాటిచే ముద్దు పెట్టించుకుంది. ఈ ఫోటోల‌ని త్రిష త‌న ట్విట్ట‌ర్ ద్వారా నెటిజ‌న్స్‌కి చేర‌వేసింది. అయితే ఇక్క‌డే అస‌లు వివాదం మొదలైంది. పెటా సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండే త్రిష‌ డాల్ఫిన్‌ లాంటి జల జీవాలను హింసిస్తుందా అంటూ జీవ ప్రాణుల సంరక్షణ సంస్థకు చెందిన వారు త్రిషపై మండిపడుతున్నారు. వాటి స్వేచ్చ‌ని హ‌రిస్తూ త్రిష ఇలాంటి ప‌నులు చేయ‌డం త‌ప్పు అంటూ డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా నిర్వాహకురాలు పరిదా తంబల్‌ నటి త్రిష చర్యలను తీవ్రంగా విమర్శించారు. సముద్రంలో సంతోషంగా జీవించే ప్రాణులైన డాల్ఫిన్లకి కాలక్షేప ఈత కొలనుల్లో సహజమైన పరిస్థితి ఎలా ఉంటుంది? మ‌నుషుల అల‌వాట్ల‌ని వాటికి నేర్పించ‌డం ఎందుకు ? అవి ఎలా జీవిస్తున్యాయో అలానే జీవించ‌నివ్వండి అని ఆవేశంగా మాట్లాడారు. స‌ర‌దా కోసం చేసిన ప‌ని త్రిష‌కి లేని పోని తిప్ప‌లు తెస్తుండ‌డంతో ఆమె త‌ల‌ప‌ట్టుకొని కూర్చుంద‌ట‌. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న పేట చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే .


5479
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles