‘క్వీన్’ రీమేక్‌లో టాలీవుడ్ బ్యూటీ

Wed,June 29, 2016 07:16 PM
trisha in queen movie remake


చెన్నై: బాలీవుడ్ నటి కంగనారనౌత్ లీడ్‌రోల్ పోషించిన క్వీన్ మూవీ బాక్సాపీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి అవార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. కంగనా కెరీర్‌లో టర్నింగ్‌పాయింట్‌గా నిలిచిన క్వీన్ మూవీ తమిళ రీమేక్‌లో టాలీవుడ్ బ్యూటీ త్రిష లీడ్ రోల్ పోషించనున్నారు. ప్రస్తుతం త్రిష నాయకి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

క్వీన్ సినిమాకు కాల్షీట్లు ఎక్కువగా అవసరముండటంతో నిర్మాతలు ఇటీవలే త్రిషను సంప్రదించినట్టు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ నటి రేవతి క్వీన్ రీమేక్‌కు దర్శకత్వం వహించనుండగా.. మరో నటి సుహాసినీమణిరత్నం డైలాగ్స్‌ను అందించనున్నట్టు సమాచారం. తమిళ నటుడు, నిర్మాత త్యాగరాజన్ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

2174
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles