నిన్ను బ్లాక్ చేస్తున్నాను : త్రిష‌

Wed,September 5, 2018 12:03 PM
trisha blocked her fan due to mis behaviour

చెన్నై చంద్రం త్రిష ఈ మ‌ధ్య లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌తో ఎక్కువ‌గా ప‌ల‌క‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు క‌న్నా త‌మిళ సినిమాల పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టింది ఈ అమ్మ‌డు. ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త్రిష న‌టించిన చిత్రం 96. విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానుంది. థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రంలో త్రిష స్కూల్ టీచర్ పాత్రలో క‌నిపించ‌నుంది. మ‌రో వైపు త్రిష తొలిసారి ర‌జ‌నీకాంత్ సినిమాలో న‌టించే అవ‌కాశాన్ని అందుకుంది. కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపొంద‌నుంది. త్రిష నటిస్తున్న మరో చిత్రం గర్జానై . 2015లో ఎన్ హెచ్ 10 అనే హిందీ మూవీ రీమేక్ గా రూపొందుతుంది .

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే త్రిష అప్పుడ‌ప్పుడు అభిమానుల‌తో లైవ్ చాట్ చేస్తుంటుంది. ఆమెతో మాట్లాడ‌డానికి ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తి చూపుతుంటారు. అయితే ఓ అభిమాని త‌న టైమ్‌లైన్‌లో వేరే న‌టుల గురించి త‌ప్పుగా మాట్లాడేస‌రికి కోపోద్రిక్తురాలైన త్రిష స‌ద‌రు అభిమానిని వెంట‌నే బ్లాక్ చేసింది. ఈ విష‌యాన్ని త‌న ట్వీట్‌లో తెలియ‌జేసింది. నా టైమ్‌లైన్‌లోకి వ‌చ్చి ఇంత అసభ్య‌క‌రంగా మాట్లాడ‌తావా ? నాపై నీకున్న అభిమానం చూపించేందుకు ఇత‌ర న‌టుల గురించి ఇంత అమ‌ర్యాద‌గా మాట్లాడుతూ ట్వీట్ చేస్తావా లేదంటే న‌న్ను వేధించేందుకు ఇలాంటి మెసేజ్‌లు పెడుతున్నావా? నేను నిన్ను బ్లాక్ చేస్తున్నాను అంటూ త్రిష ట్వీట్ చేసింది.


5269
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles