ట్రెండ్ మారిన ఫ్రెండ్ మార‌డు అంటున్న రామ్

Sun,August 6, 2017 10:34 AM
Trendu Maarina Friendu Maaradu song

ఎనర్జిటిక్ హీరో రామ్ , స్టైలిష్ డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ . స్ర‌వంతి మూవీస్, పి.ఆర్ సినిమా బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ రీసెంట్ గా విడుద‌ల చేశారు. రామ్ త‌న ఫ్రెండ్స్ తో క‌లిసి బీచ్ సైడ్ షికారు కి వెళుతున్న సీన్ కి సంబంధించిన‌ పిక్ ని ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ గా విడుద‌ల చేశారు. పెళ్ళి చూపులు ఫేం ప్రియ‌ద‌ర్శి ఫ్రెండ్ గ్రూపులో క‌నిపించ‌గా, ఇది ప‌క్కా ఎంట‌ర్ టైన‌ర్ చిత్రంగా ఉంటుంద‌ని ఫ్యాన్స్ భావించారు. ఇక ఫ్రెండ్‌షిప్ డే సంద‌ర్భంగా ట్రెండ్ మారిన ఫ్రెండ్ మార‌డు అనే లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు. ఈ సాంగ్ అంద‌రిని అల‌రిస్తుంది. త్వ‌ర‌లో చిత్ర టీం ఊటీ షెడ్యూల్ కి వెళ్ల‌నుండగా సెప్టెంబ‌ర్ లో మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

1041
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS