కొత్తబంగారులోకం హీరోయిన్ శ్వేతాబసుప్రసాద్ పెళ్లయిపోయింది

Fri,December 14, 2018 05:43 PM
Trending Pics From Actress Shweta Basu Prasad's Wedding

ఎ..క్కాడ అంటూ కొత్తబంగారులోకం సినిమాలో తన అమాయకత్వంతో నవ్వించిన హీరోయిన్ శ్వేతాబసుప్రసాద్ గుర్తుందా? ఆమె పెళ్లయిపోయింది. నిన్ననే ఆమె పెళ్లి జరిగింది. పూణెలో బెంగాళీ, మరాఠీ సంప్రదాయాల్లో ఆమె పెళ్లి జరిగింది. రోహిత్ మిట్టల్ అనే వ్యక్తిని శ్వేత పెళ్లి చేసుకుంది. బెంగాలీ పెళ్లికూతురుగా పింక్ శారీ కట్టుకొని మెరిసిపోయింది శ్వేత. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను శ్వేత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. తన పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. తన ప్రీ వెడ్డింగ్ సెరమనీ ఫోటోలను శ్వేత ఫ్యాన్స్ క్లబ్ అకౌంట్‌లో షేర్ చేశారు. అంతకుముందు బ్యాచ్‌లర్ పార్టీని కూడా శ్వేత ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. బాలీలో తన ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాచ్‌లర్ పార్టీని ఎంజాయ్ చేసింది శ్వేత.

శ్వేత, రోహిత్ 2017లో నిశ్చితార్థ జరుపుకున్నారు. గోవాలో రోహిత్‌ను శ్వేతే ప్రపోజ్ చేసిందట. ఆయన ఫిలిం మేకర్. గత నాలుగు సంవత్సరాల నుంచి వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందట. వీళ్లిద్దరు కలిసి కొన్ని షార్ట్ ఫిలింస్ మేకింగ్‌లోనూ పాలుపంచుకున్నారట. చివరకు నిన్న ఒక్కటయిపోయారు.

శ్వేతాబసుప్రసాద్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2002లో మక్‌డీ అనే సినిమాలో తన నటనకు గాను నేషనల్ అవార్డు వరించింది. తర్వాత టీవీషోల్లోనూ శ్వేత నటించింది. తెలుగులోనూ నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించింది.View this post on Instagram

Let. The. Bachelorette. Begin!

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on


5163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles