ర‌జనీకాంత్ చిత్రంలో ట్రాన్స్‌జెండ‌ర్‌

Tue,June 25, 2019 09:20 AM
transgender plays key role in DARBAR

మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ చేస్తున్న తాజా చిత్రం ద‌ర్భార్. ఇందులో ర‌జ‌నీ డ్యూయ‌ర్ రోల్ పోషిస్తుండ‌గా, ఇందులో ఒకటి పోలీసు అధికారి పాత్రకాగా, మ‌రొక‌టి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు. ఈ చిత్రం అభిమానుల‌కి మంచి ఫీస్ట్ ఇస్తుంద‌ని నిర్మాత‌లు చెబుతున్నారు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 9న‌ విడుదలకానుంది. బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామ‌స్ , మ‌ల‌యాళ న‌టుడు చెంబన్ వినోద్ జోస్ ద‌ర్భార్ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

మ‌రి కొద్ది మంది ప్ర‌ముఖులు కూడా చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా, వారి పేర్లు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కి వ‌స్తున్నాయి. ఇటీవ‌ల యువ‌రాజ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ కీల‌క పాత్ర పోషించాడ‌ని వార్త‌లు రాగా, తాజాగా ఓ ట్రాన్స్‌జెండ‌ర్ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని చెబుతున్నారు. విజ‌య్ సేతుప‌తి న‌టించి ధ‌ర్మ‌దొరైలో న‌టించిన జీవా అనే ట్రాన్స్‌జెండ‌ర్ ఇప్పుడు ద‌ర్భార్ లో కూడా న‌టిస్తుంద‌ట‌. ప్ర‌స్తుతం ఇద్ద‌రి మ‌ధ్య కీల‌క సన్నివేశాల‌ని తెర‌కెక్కిస్తున్నారు. ద‌ర్భార్ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు.



656
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles