'టోట‌ల్ ధ‌మాల్' ట్రైల‌ర్‌కి వ‌స్తున్న భారీ రెస్పాన్స్

Tue,January 22, 2019 11:26 AM
Total Dhamaal Official Trailer released

ద‌ర్శ‌కుడు ఇంద్ర‌కుమార్ తెర‌కెక్కిస్తున్న కామెడీ సిరీస్‌లో మూడో భాగంగా వ‌స్తున్న చిత్రం టోట‌ల్ ధ‌మాల్‌. అజయ్‌ దేవగణ్‌, అనిల్‌ కపూర్‌, మాధురీ దీక్షిత్‌, జానీ లివర్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా డిసెంబ‌ర్‌లో విడుద‌ల కావ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికి ప‌లు కార‌ణాల వల‌న వాయిదా ప‌డింది. ఫిబ్ర‌వ‌రి 22 చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌, మారుతి మల్టీనేషనల్‌ సంస్థలతో కలిసి అజయ్‌ దేవగన్‌ స్వయంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాలు ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. థ్రిల్లింగ్‌తో పాటు అడ్వెంచ‌ర‌స్‌గా ఉన్న ఈ స‌న్నివేశాల‌కి కాస్త కామెడీ జోడించాడు ద‌ర్శ‌కుడు. ట్రైల‌ర్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. విడుద‌లైన కొద్ది గంట‌ల‌లోనే 89 ల‌క్ష‌ల‌కి పైగా వ్యూస్ రాబ‌ట్టింది. ఈ చిత్రం త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌ని టీం భావిస్తుంది. హిమేష్ రేషమియా చిత్రానికి సంగీతమందించాడు. ఆయ‌న స్వ‌ర‌ప‌ర‌చిన బాణీల‌కి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అమీర్ ఖాన్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన‌ట్టు స‌మాచారం.

1261
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles