బాద్ షా సినిమాలో బిగ్ బి,త‌లైవా,యంగ్ రెబ‌ల్ స్టార్ !

Fri,August 11, 2017 12:47 PM
బాద్ షా సినిమాలో బిగ్ బి,త‌లైవా,యంగ్ రెబ‌ల్ స్టార్ !

త్వ‌ర‌లో వెండితెర‌పై ఒక అద్భుతం జ‌ర‌గ‌నుందా అంటే.. అవును అనే స‌మాధానం వినిపిస్తుంది. బీ టౌన్ స‌మాచారం ప్ర‌కారం బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో శిద్యాత్ అనే పేరుతో ఓ మూవీ రూపొంద‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చ‌న్, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అతిధి పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారట‌. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపొందనున్న ఈ చిత్రం భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌నుందని దీనికి క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ని బాలీవుడ్ మీడియా చెబుతుంది. మ‌రి షారూఖ్ ఖాన్ సినిమాలంటేనే ఆడియ‌న్స్ లో క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటిది ముగ్గురు స్టార్ హీరోలు షారూఖ్ సినిమాలో క‌నిపిస్తార‌నే స‌రికి సినీ ల‌వ‌ర్స్ ఆనందం పీక్ స్టేజ్ కి వెళ్లింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేక‌పోయిన‌ప్ప‌టికి ఆయా హీరోల అభిమానులు మాత్రం ఈ వార్త‌ని ఫుల్ వైర‌ల్ గా మారుస్తున్నారు. మ‌రి దీనిపై ఏ హీరో అయిన స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.

1382

More News

VIRAL NEWS