బాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ చేతికి మ‌హాన‌టి..!

Thu,May 17, 2018 09:30 AM
top producer acquire hindi satellite rights for mahanati

లెజండ‌రీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి. కేవ‌లం తెలుగు ప్రేక్ష‌కుల‌నే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ల‌వ‌ర్స్ మ‌న‌సులు గెలుచుకుంది ఈ చిత్రం. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌లైన ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట మూవీ మేక‌ర్స్. తాజా స‌మాచారం ప్ర‌కారం బాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ ఆదిత్య చోప్రా ఈ సినిమా హిందీ డ‌బ్బింగ్ రైట్స్ ద‌క్కించుకున్నాడ‌ని తెలుస్తుంది. ఇటీవ‌లే ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయ‌న‌కి చిత్రం చాలా న‌చ్చ‌డంతో వెంట‌నే ఈ నిర్ణ‌యానికి వ‌చ్చాడ‌ట‌. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రం వైజ‌యంతి మూవీస్ బేన‌ర్‌పై ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్నా ద‌త్ నిర్మాణంలో రూపొందింది. మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టించ‌గా, మ‌ధుర‌వాణిగా స‌మంత‌, విజ‌య్ ఆంటోనిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఎస్వీఆర్‌గా మోహ‌న్ బాబు, ఏఎన్ఆర్‌గా చైతూ న‌టించారు. క్రిష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, షాలిని పాండే, అవ‌స‌రాల శ్రీనివాస్‌ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. మిక్కీ జే మేయ‌ర్ చిత్రానికి సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే.

3585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles