సూప‌ర్ స్టార్ స‌ర‌స‌న ఇద్ద‌రు భామ‌లు..!

Thu,February 28, 2019 12:41 PM
top heroines paired with rajinikanth

మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ హీరోగా ఓ మూవీ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నుంది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించ‌నున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రానికి సంబంధించి రోజుకొక వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇటీవ‌ల చిత్రంలో క‌థానాయిక‌గా న‌య‌నతారని తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత చిత్రంలో ర‌జ‌నీకాంత్ సామాజికవేత్తగా, పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రల్లో నటించబోతున్నారనే ప్రచారం జ‌రిగింది. తాజాగా చిత్రంలో ఇద్ద‌రు క‌ధానాయిక‌లు ఉంటార‌ని అందులో ఒక‌రు న‌య‌న‌తార కాగా, మ‌రొక‌రు కీర్తి సురేష్ అని అంటున్నారు. న‌య‌న‌తార గ‌తంలో ర‌జ‌నీతో క‌లిసి చంద్ర‌ముఖి, క‌థానాయ‌కుడు చిత్రాలు చేసింది. కాని కీర్తి ఇప్ప‌టి వ‌ర‌కు ర‌జనీకాంత్‌తో ఒక్క చిత్రం చేయలేదు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం మార్చి మొదటి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించనున్నాడు. ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మురుగ‌దాస్- ర‌జనీకాంత్ ప్రాజెక్ట్‌కి సంబంధించి వ‌స్తున్న వార్త‌ల‌లో నిజ‌మెంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగ‌క త‌ప్ప‌దు మ‌రి!

1644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles