దీపావ‌ళి బ‌రిలో న‌లుగురు స్టార్ హీరోలు..

Sun,July 1, 2018 12:46 PM
top heroes fight on box office

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగకి పెద్ద హీరోల సినిమాలు ఎలా సంద‌డి చేస్తాయో, కోలీవుడ్‌లో దీపావ‌ళికి బ‌డా సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం ఆన‌వాయితి. ఈ దీపావ‌ళికి న‌లుగురు త‌మిళ స్టార్ హీరోలు పోటీ ప‌డేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. విజ‌య్ ప్ర‌స్తుతం స‌ర్కార్ చిత్రంతో బిజీగా ఉండ‌గా, ధ‌నుష్ మారి 2, విశాల్ ‘సండకోళి 2’, సూర్య ఎన్‌జీకే చిత్రాలు చేస్తున్నారు. ఈ న‌లుగురు హీరోలు త‌మ తాజా చిత్రాల‌తో దీపావళికి ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నారని స‌మాచారం. ఈ రేసులో అజిత్ చిత్రం కూడా ఉంటుంద‌ని భావించిన‌ప్ప‌టికి ఆయ‌న చిత్రం వ‌చ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది.

మురుగదాస్ , విజ‌య్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న స‌ర్కార్ చిత్రం ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. స్టైలిష్ లుక్‌లో కనిపించిన విజ‌య్‌ని చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక 2005లో విశాల్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం సండ‌కోళి( తెలుగులో పందెంకోడి) . ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌ ‘సండకోళి 2’ పేరుతో తెరకెక్కుతోంది. విశాల్‌కు జోడీగా కీర్తిసురేష్‌ నటించారు. ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన మారి సినిమాకి సీక్వెల్‌గా మారి 2 రూపొందుతుంది. బాలాజీ మోహన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌. సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ఎన్‌జీకే. డ్రీమ్ వారియర్ ఫిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సాయిప‌ల్ల‌వి ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

2504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles