సుకుమార్ నిర్మాణంలో నిహారిక చిత్రం ..!

Sat,February 16, 2019 09:56 AM

నాగ‌బాబు కుమార్తె నిహారిక ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె న‌ట‌నకి మంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. త్వ‌ర‌లో సూర్య‌కాంతం అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించనుంది . అయితే త్వ‌ర‌లో సుకుమార్ నిర్మాణంలో నిహారిక ఓ సినిమా చేయ‌నుంద‌ని ప‌లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌వైపు ద‌ర్శకుడిగా రాణిస్తూనే మ‌రో వైపు సుకుమార్ రైట‌ర్స్ అనే సంస్థ‌లో త‌న శిష్యుల ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేస్తున్నాడు సుక్కూ. ప్ర‌స్తుతం మైత్రి మూవీ మేకర్స్‌తో క‌లిసి రెండు సినిమాలు చేస్తున్న సుకుమార్‌.. అతి త్వర‌లోనే నిహారిక‌తో క‌లిసి సినిమా చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు టాక్. ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ మూవీగా ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ చిత్రాన్ని సుకుమార్ ద‌ర్శ‌కుల‌లో ఒక‌రు తెర‌కెక్కించ‌నున్న‌ట్టు టాక్. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అతి త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే సుకుమార్ త్వ‌ర‌లో మ‌హేష్ బాబు హీరోగా ఓ మూవీ చేయ‌నున్నాడు. ఈ సినిమా క‌థ‌కి సంబంధించి ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇక నిహారిక చిరు ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న సైరాలో కీల‌క పాత్ర చేస్తుంది.

1849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles