ద ల‌య‌న్ కింగ్‌లో భాగం కానున్న జ‌గ‌ప‌తి బాబు

Wed,June 26, 2019 09:48 AM

డిస్నీ సంస్థ నుండి వ‌చ్చిన యానిమినేష‌న్ చిత్రాలు సిండ్రెల్లా, ద జంగ‌ల్ బుక్, బ్యూటీ అండ్ ద బీస్ట్‌లు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకోగా, ఇప్పుడు అదే సంస్థ నుండి ద ల‌య‌న్ కింగ్ అనే చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. హై విజువల్స్ తో జులై 19న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. 1994లో వ‌చ్చిన యానిమేష‌న్ చిత్రం ద ల‌య‌న్ కింగ్‌కి ఉన్న‌త ప్ర‌మాణాలు జోడించి 3డీ యానిమేష‌న్‌లో చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. జోన్ ఫావ్రే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలోని పాత్ర‌లకు హాలీవుడ్ టాప్‌ స్టార్స్ డబ్బింగ్ అందించారు. తెలుగులోను ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నుండ‌డంతో ఇందులోని ప‌లు పాత్ర‌ల‌కి తెలుగు టాప్ స్టార్స్‌తో డ‌బ్బింగ్ చెప్పిస్తున్నారు.


ద ల‌య‌న్ కింగ్ అనే చిత్రంలో సింబ అనే సింహం, టీమోన్ అనే ముంగిస‌, పుంబా అనే అడ‌వి పంది చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లుగా ఉంటాయి. ముసాఫా అనేది కూడా చిత్ర ప్ర‌ధాన పాత్ర కాగా, బాలీవుడ్‌లో ఈ పాత్ర‌కి షారూఖ్ ఖాన్ డ‌బ్బింగ్ చెప్పారు. ముసాఫా త‌న‌యుడు సినిమాకి హీరో అయిన సింబాకి షారూఖ్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డ‌బ్బింగ్ చెప్పారు. తెలుగు వెర్షన్‌లో పుంబా పాత్రకు బ్రహ్మానందం, టీమోన్‌ పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పారు. ఇక ఇక ప్రధాన పాత్రలైనా స్కార్ పాత్రకు జగపతి బాబు , ముఫాసాకు రవి శంకర్ డబ్బింగ్ చెబుతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ‘లయన్‌ కింగ్‌’ చిత్రం కొత్త హంగులతో 3డి యానిమేటెడ్‌ సినిమాగా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించడం ఖాయ‌మ‌ని టీం అంటుంది .

749
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles