వైర‌ల్ ఫోటో... సితార తో మ‌హేశ్.. న‌మ్ర‌త షేర్ చేసింది

Thu,September 7, 2017 12:50 PM
Tollywood Super star Mahesh babu with his beloved daughter sitara photo goes viral

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ రీసెంట్ గా ఓ ఫోటోను త‌న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. ఆ ఫోటో స్పెషాలిటీ ఏంటంటే.. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ తో త‌న గారాల ప‌ట్టి సితార ఉన్న ఫోటో అది. మ‌హేశ్ లేటెస్ట్ మూవీ స్పైడ‌ర్ షూటింగ్ సెట్ లో తీసిన ఫోటో అది. మ‌హేశ్ వెన‌క నిల‌బ‌డి ఎంతో క్యూట్ గా సితార న‌వ్వుతున్న ఈ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఇక‌.. ఆ ఫోటో షేర్ అయిన కొన్ని గంట‌ల్లోనే దాదాపు 13500 లైక్స్ ను సంపాదించింది.

ప్ర‌స్తుతం స్పైడ‌ర్ మూవీ షూటింగ్ లో రొమానియాలో మ‌హేశ్ బిజీ బిజీ గా ఉన్నారు. ఇంట‌లీజెన్స్ ఆఫీస‌ర్ గా ఈ మూవీలో మ‌హేశ్ న‌టిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఏఆర్ ముర‌గ‌దాస్ డైరెక్ట‌ర్. సెప్టెంబ‌ర్ 22 న మూవీ రిలీజ్ అవ‌నుంది. స్పైడ‌ర్ మూవీ త‌ర్వాత భ‌ర‌త్ అనే నేను, జ‌న గ‌ణ మ‌న అనే సినిమాల్లో మ‌హేశ్ న‌టించ‌నున్నాడు.
2491
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS