సల్మాన్‌కు టాలీవుడ్ హీరో వాయిస్ ఓవర్

Tue,April 23, 2019 04:58 PM


బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ భారత్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. భారత్ సినిమా కోసం టాలీవుడ్ నటుడు రాంచరణ్ వాయిస్ ఓవర్ అందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. భారత్ ట్రైలర్ తెలుగు వెర్షన్‌లో సల్మాన్‌కు రాంచరణ్ డబ్బింగ్ చెబుతున్నాడట.


ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్‌లో స్వల్ప గాయమవడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు చరణ్. తెలుగుతోపాటు తమిళంలో కూడా భారత్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకురానుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారత్ సినిమా ఈద్ కానుకగా జూన్ 5న విడుదల కానుంది. సల్మాన్‌ఖాన్‌కు జోడీగా కత్రినాకైఫ్ నటిస్తోంది. సల్మాన్ ఖాన్, రాంచరణ్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే.

1420
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles