తమిళ డైరెక్టర్లపై ఫోకస్ పెట్టిన టాలీవుడ్ హీరోలు!

Tue,October 25, 2016 07:04 AM

టాలీవుడ్ హీరోలు కొంతకాలంగా ఇతర భాషా చిత్రాలను, దర్శకులను, ఆయా మూవీల విజయాలను గమనిస్తున్నారు. ఆయా భాషల్లో తీసిన దర్శకులతో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. రీమేక్స్ చేస్తున్నారు. ఒకప్పుడేమో కానీ ఇప్పుడు రీమేక్ పిక్చర్స్ సక్సెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళంలో సక్సెస్ లు ఇచ్చిన డైరెక్టర్లను ఎంచుకుంటున్నారు.


లేటెస్ట్ గా తీసుకుంటే... సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు తమిళ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ కూడా స్పీడ్ గా సాగుతోంది. ఈ దీపావళికి ఆ సినిమా టీజర్ కూడా రాబోతోంది. ఇక మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ కూడా తమిళ డైరెక్టర్ తో పనిచేయడానికి కమిట్ అయ్యాడట. డైరెక్టర్ లింగుస్వామితో ఓ పిక్చర్ చేయబోతున్నాడు.

ఇక పవన్ కళ్యాణ్ కూడా మరో తమిళ డైరెక్టర్ నేసన్ తో పిక్చర్ చేయబోతున్నాడు. అజిత్ హీరోగా తమిళంలో తీసిన 'వేదాళమ్' మూవీ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సినిమాను తెలుగులో పవన్ తో తీస్తారని ఆ మధ్య అనుకున్నారు. ఇప్పుడు అది ఇంప్లిమెంట్ అవుతోంది. ఈ సినిమాకు ముహూర్తం కూడా కుదిరింది. తమిళ దర్శకుడు 'నేసన్' ఈ సినిమాను డైరెక్ట్ చేయనుండగా ఎఎం రత్నం నిర్మించనున్నారు. ఇంక జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య , అఖిల్ వంటి హీరోలు కూడా తమిళ డైరెక్టర్లపైనే బోలెడన్ని హోప్స్ పెట్టుకున్నట్టు సమాచారం.

1708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles