ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు

Sat,February 23, 2019 06:37 PM
Tollywood Director Kodi Ramakrishna Funeral Ends

హైదరాబాద్‌: శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. రామకృష్ణ పెద్ద కుమార్తె దీప్తి అంతిమ సంస్కారాలు నిర్వహించి తండ్రి చితికి నిప్పంటించారు. ఇవాళ జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలోకి భౌతికకాయాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో సినీ, రాజకీయ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. అంతకుముందు రామకృష్ణ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్లో ఉంచారు. కె.రాఘవేంద్రరావు, కోట శ్రీనివాసరావు, వి.వి.వినాయక్‌, ఎన్‌.శంకర్‌ పలువురు నివాళులు అర్పించారు.

కోడి రామకృష్ణకు భార్య పద్మ, ఇద్దరు అమ్మాయిలు దీప్తి, ప్రవళ్లిక ఉన్నారు. కోడిరామకృష్ణ మృతిపట్ల తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

3145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles