కోడి రామ‌కృష్ణ‌కి ప్ర‌ముఖుల నివాళులు

Fri,February 22, 2019 04:21 PM
tollywood condolence to Kodi Ramakrishna

గురువారం ఉదయం శ్వాస‌కోస సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతూ గచ్చిబౌలిలోని ప్ర‌ముఖ ఆసుప‌త్రిలో చేరిన కోడి రామ‌కృష్ణ ఈ రోజు మ‌ధ్యాహ్నం క‌న్నుమూశారు. ఆయ‌న మృతితో టాలీవుడ్ ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. అలాంటి మంచి మ‌నిషి అనారోగ్యంతో క‌న్నుమూయ‌డం బాధాక‌రం అని బాల‌కృష్ణ అన్నారు. గొప్ప ద‌ర్శ‌కుడిని కోల్పోవ‌డం సినీ ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాలని భ‌గవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని బాల‌య్య తెలిపారు.జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్, బీవీఎస్ ర‌వి,గోపిచంద్ మ‌లినేని, సుధీర్ బాబు, అనీల్ రావిపూడి త‌దిత‌రులు కోడి రామ‌కృష్ణ మృతికి సంతాపం తెలియ‌జేస్తూ ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప్రార్ధించారు. ఇండ‌స్ట్రీలో దాదాపు అంద‌రు స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన కోడి రామ‌కృష్ణ తెలుగు సినిమా స్థాయిని ఉన్న‌త స్థాయికి తీసుకెళ్లారు. మ‌రి కొద్ది క్ష‌ణాల‌లో ఫిలిం న‌గ‌ర్‌లోని త‌న నివాసానికి కోడి రామ‌కృష్ణ భౌతిక కాయాన్ని త‌ర‌లించ‌నున్నారు. రేపు అభిమానుల సంద‌ర్శ‌నార్ధం ఛాంబ‌ర్‌లో ఆయ‌న‌ పార్ధివ దేహాన్ని ఉంచ‌నున్న‌ట్టు తెలుస్తుంది. శనివారం సాయంత్రం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నార‌ట‌.
































1795
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles