శివ‌రాత్రి వేడుక‌లో స్టెప్పులేసిన కాజ‌ల్‌, త‌మ‌న్నా, అదితి

Tue,March 5, 2019 12:40 PM

మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న శివాల‌యాలు భ‌క్తుల‌తో పోటెత్తాయి. సోమ‌వారం, శివ‌రాత్రి ఒకే రోజు రావ‌డంతో సామాన్య భక్తులే కాక సెల‌బ్రిటీలు భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగి తేలారు. ప్ర‌ముఖ కథానాయిక‌లు కాజ‌ల్ అగ‌ర్వాల్‌, త‌మ‌న్నా, అది రావు హైద‌రితో పాటు రానా ఆధ్యాత్మిక గురువు స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్‌కి చెందిన యోగా సెంట‌ర్‌కి వెళ్ళారు. శివ‌రాత్రికి సంబంధించి వాసుదేవ్ చేసిన‌ పలు ప్ర‌సంగాలని శ్ర‌ద్ధ‌గా విన్నారు. ఆ త‌ర్వాత ఎంట‌ర్‌టైన్‌మెంట్ కార్య‌క్ర‌మాలు మొద‌లు కాగా, ఈ కార్య‌క్ర‌మంలో కాజ‌ల్‌, త‌మ‌న్నా, కాజ‌ల్ సోద‌రి నిషా అగ‌ర్వాల్‌లు వాసుదేవ్‌తో క‌లిసి డ్యాన్స్‌లు చేశారు. ప్ర‌స్తుతం డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

3167
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles