ప్రైవేట్ పార్టీలో చిరు, రాజ‌శేఖ‌ర్‌, మోహ‌న్ బాబు

Fri,January 5, 2018 12:24 PM
tollywood celebrities private party

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మెగా స్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా ఇటీవ‌ల తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వరిలో రెండో షెడ్యూల్ మొద‌లు కానుంద‌ని తెలుస్తుంది. మొన్న‌టి వ‌ర‌కు పొడుగు మీసం, భారీ గ‌డ్డంతో కనిపించిన చిరు ఇప్పుడు నార్మ‌ల్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. రెండో షెడ్యూల్‌కి కాస్త టైం దొర‌క‌డంతో దాదాపు అన్నీ ఈవెంట్స్, పార్టీస్ క‌వర్ చేస్తున్నాడు చిరు. రీసెంట్‌గా మెగాస్టార్ ఓ ప్రైవేట్ పార్టీలో మెరిసారు. మోహ‌న్ బాబు, సుబ్బి రామి రెడ్డి, అశ్వినీద‌త్‌, నాగ బాబు తో పాటు రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీ అంతా పార్టీలో క‌నిపించారు. అయితే ఇటీవలే డిసెంబర్ 31వ తేది రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టి.సుబ్బరామిరెడ్డి గారు తన ఏడు నక్షత్రాల హోటల్ లో ఇచ్చిన విందుకు అందుబాటులో ఉన్న తారలంతా తరలి వెళ్లారు. ఆ సందర్భంలో వీరు ఇలా ఫోటోలకి ఫోజులిచ్చారు. ఏదేమైన చాలా రోజుల తర్వాత రాజ‌శేఖ‌ర్‌, చిరు,మోహన్ బాబు ఇంత అన్యోన్య‌యంగా క‌నిపించ‌డం ఆయా హీరోల అభిమానుల‌లో ఎంతో ఆనందాన్ని క‌లిగిస్తుంది.2316
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS