ఆన్‌లైన్‌లో తొలిప్రేమ సాంగ్స్‌

Sat,January 20, 2018 09:58 AM
toli prema songs available in online

వ‌రుణ్ తేజ్, వెంకీ అట్లూరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం తొలి ప్రేమ‌. అంద‌మైన ప్రేమ క‌థా చిత్రంగా తెర‌కెక్కిన ఈ మూవీ ఫిబ్రవ‌రి 9న రిలీజ్‌కి రెడీ అయింది. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇందులో .. మ‌న జీవితంలోకి ఎంత మంది అమ్మాయిలు వ‌చ్చిన ఫ‌స్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎన్న‌టికి మ‌ర‌చిపోలేం అనే డైలాగ్ అంద‌రి మ‌న‌స్సుల‌కి హ‌త్తుకుంది. ఇక చిత్రంలో నిన్నిలా అనే సాంగ్‌కి సూప‌ర్ రెస్పాన్స్ రావడంతో మేక‌ర్స్ కంప్లీట్ ఆల్బమ్‌ని ఆన్‌లైన్‌లో విడుద‌ల చేశారు. మొత్తం చిత్రంలో ఆరు సాంగ్స్ ఉండ‌గా, ప్ర‌స్తుతం ఇవి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. థ‌మ‌న్ సంగీతంలో రూపొందిన ఈ ఆరు పాట‌ల‌ని ర‌ఘు దీక్షిత్‌, శ్రేయా ఘోష‌ల్, అర్మాన్ మాలిక్‌, రాహుల్ నంబియార్ త‌దిత‌రులు పాడారు. శ్రీమణి లిరిక్స్ అందించారు. రాశీ ఖ‌న్నా చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివియస్ ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించిన సంగ‌తి తెలిసిందే.

2998
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles