వంద కోట్ల క్లబ్ లో ‘టాయిలెట్’

Sun,August 20, 2017 10:15 PM
toilet-ek prem katha entered 100 crore club


ముంబై : సామాజిక కథాంశంతో తెరకెక్కిన ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా’ మూవీ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల తో దూసుకెళ్తుంది. శ్రీనారాయణ్ సింగ్ డైరెక్షన్ లో అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ వంద కోట్ల క్లబ్ లోకి చేరినట్లు బాలీవుడ్ సినీ విశ్లేషకులు వెల్లడించారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ తొమ్మిది రోజుల్లో రూ.106.8 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. ప్రధాని మోదీ ప్రారంభించిన స్వచ్చ భారత్ క్యాంపెయిన్ లో భాగంగా మరుగు దొడ్ల ప్రాముఖ్యత ను తెలిపే కథాంశంతో టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా తెరకెక్కింది. ఈ మూవీకి యూపీ ప్రభుత్వం వినోద పన్ను కూడా మినహాయింపునిచ్చింది.

1587
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles