ఈ రోజు సైరా సెట్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న చిరు, న‌య‌న్‌.!

Thu,March 15, 2018 08:25 AM
today CHIRANJEEVI enter into syeraa sets

ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహ‌రెడ్డి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి 151వ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో టాప్ స్టార్స్ న‌య‌న‌తార‌, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, రెండో షెడ్యూల్‌కి రెడీ అయింది. చిత్రానికి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు అభిమానుల ఆనందాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళుతున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ రోజు నుండి అన్న‌పూర్ణ స్డూడియోలో సైరా సెకండ్ షెడ్యూల్ నిర్వ‌హించ‌నున్నార‌ని తెలుస్తుండ‌గా, ఈ షెడ్యూల్‌లో చిరుతో పాటు న‌య‌న‌తార, విజ‌య్ సేతుప‌తి కూడా పాల్గొంటార‌ని తెలుస్తుంది. నెల‌ఖారున జ‌రిగే మ‌రో షెడ్యూల్‌లో రెండు రోజ‌ల పాటు అమితాబ్ చిత్ర షూటింగ్‌లో పాల్గొన‌నున్నార‌ని స‌మాచారం.

సైరా చిత్రంలో న‌ర‌సింహారెడ్డి చిన్న‌నాటి విష‌యాల‌ని కూడా చూపించ‌నుండ‌గా, ఆ పాత్ర కోసం ముంబైకి చెందిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్‌ని ఎంపిక చేశారు. ఆ బాలుడిపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. చారిత్ర‌క నేప‌ధ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్స్‌తో పాటు వెరైటీ కాస్ట్యూమ్స్‌ని కూడా సిద్ధం చేస్తున్నారు . 'పద్మావత్' కి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేసిన చంద్రకాంత్ సొనావెన్ సైరా సినిమాకి పనిచేస్తున్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా ఈ వర్క్ లో భాగం అవుతోంది. కాస్ట్యూమ్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో పరిధిలోని ఎకరం స్థలంలో భారీ షాప్ ను ఏర్పాటు చేసి .. అందులో చిత్రానికి అవ‌స‌ర‌మైన‌ కాస్ట్యూమ్స్ అన్నింటినీ ఉంచుతున్నారని టాక్‌. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

2265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles