ఆలోచ‌న రేకెత్తిస్తున్న అనుష్క మూవీ టైటిల్ పోస్ట‌ర్

Sun,July 21, 2019 07:55 AM
title poster of Nishabdham gets different thoughts

అందాల భామ అనుష్క జూలై 20, 2019తో చిత్రసీమలో 14ఏళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది. ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌లో న‌టించిన అనుష్క తాజాగా నిశ్శబ్ధం అనే చిత్రం చేస్తుంది. . హేమంత్ మధుకర్ దర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటున్నది. అయితే రీసెంట్‌గా టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో వివిధ రంగుల‌తో ఉన్న రెండు చేతులు 301అనే నెంబ‌ర్‌ని చూపిస్తున్న‌ట్టుగా ఉంది. ఒక చేతికి తాళం ఉన్న బ్రేస్‌లెట్ ఉండ‌గా, బ్యాక్ గ్రౌండ్‌లో పెద్ద ద్వారం క‌న‌బ‌డుతుంది. ఈ టైటిల్ పోస్ట‌ర్ అభిమానుల‌లో ప‌లు ఆలోచ‌న‌లు రేకెత్తిస్తుంది. ఆమెరికాలోని సియాటల్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం. షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. నిర్మాణానంతర కార్యక్రమాల్ని యూ.ఎస్‌లోనే జరుపబోతున్నాం. తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషల్లో ఈ సంవత్సరాంతంలో భారీస్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అనుష్క పాత్ర చిత్రణ మునుపెన్నడూ లేని విధంగా వైవిధ్యంగా ఉంటుంది అని నిర్మాతలు తెలిపారు. ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్‌మ్యాడ్‌సన్, షాలినిపాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

1141
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles