బాలీవుడ్ కిస్సింగ్ వీరుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో సౌమిక్ సేన్ తెరకెక్కించిన చిత్రం చీట్ ఇండియా. నకల్ మైన్ హై అకల్ హై అనేది ట్యాగ్ లైన్. శ్రేయా ధన్వంతరి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని జనవరి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు చిత్ర బృందం. అయితే రిలీజ్‌కి కొద్ది రోజుల ముందు సెన్సార్ బోర్డ్ నుండి ఓ సమస్య ఎదురైంది. చీట్ ఇండియా అనే పేరు కొన్ని వర్గాల ప్రజల మనోభోవాలు దెబ్బతీస్తుందని, టైటిల్‌ని వెంటనే మార్చాలంటూ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో చిత్ర యూనిట్ చీట్ ఇండియా పేరుని వై చీట్ ఇండియాగా మార్చి కొత్త పోస్టర్స్ విడుదల చేశారు. ట్యాగ్‌లైన్ కొత్త పోస్టర్లో కనిపించకపోవడం విశేషం. నిన్న మీడియాతో మాట్లాడిన ఇమ్రాన్ హష్మీ నరేంద్రమోదీ బారత దేశంలో అతి పెద్ద మోసగాడు అని కామెంట్ చేయడంతో దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలోను హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ వివాదాలు సినిమా రిలీజ్‌కి ఏమైన అడ్డుపడతాయా లేదా అనేది చూడాలి.