నితిన్‌- శ‌ర్వానంద్ మ‌ల్టీ స్టార‌ర్ టైటిల్ ఏంటో తెలుసా ?

Mon,December 18, 2017 10:55 AM
Title For Nithin Sharwanand  Multi starrer is interesting

నితిన్ ప్ర‌ధాన పాత్ర‌లో దిల్ సినిమాని నిర్మించి ఆ సినిమానే త‌న ఇంటి పేరుగా మార్చుకున్న నిర్మాత దిల్ రాజు. ప్ర‌స్తుతం వ‌రుస హిట్స్‌తో దూసుకెళుతున్న దిల్ రాజు శ‌తమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగేశ్నద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస క‌ళ్యాణం అనే చిత్రం చేయ‌నున్నాడు. ఇందులో నితిన్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్నాడు. ఇదీ కాక నితిన్‌- శ‌ర్వానంద్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేశాడు ఈ ప్ర‌ముఖ నిర్మాత‌. ఈ మూవీకి సంబంధించి అభిమానుల‌లో ప‌లు అనుమానాలు ఉండ‌గా, రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు. దాగుడుమూత‌లు అనే టైటిల్‌ని ఈ చిత్రానికి ప‌రిశీలిస్తుండ‌గా ఇందులో ర‌కుల్‌, సాయి ప‌ల్ల‌విని క‌థానాయిక‌లుగా ఎంపిక చేసినున్న‌ట్టు తెలుస్తుంది. ఇటీవ‌ల దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ అనే చిత్రం తెర‌కెక్కించిన హ‌రీష్ శంక‌ర్ ఈ మూవీని డైరెక్ట్ చేయ‌నున్న‌ట్టు టాక్. ఇక క‌మ‌ల్‌-శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కిన సెన్సేష‌నల్ మూవీ భార‌తీయుడుకి సీక్వెల్‌గా భార‌తీయుడు 2 రానున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రూపొంద‌నుంద‌నే టాక్స్ వచ్చిన‌ప్ప‌టికి, ప్ర‌స్తుతం తాను ఈ మూవీ చేసే ఆలోచ‌న‌లో లేన‌ని దిల్ రాజు అన్నాడు.


2208
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles