టైటానిక్ మరోసారి ప్రేక్షకుల ముందుకు ..!

Fri,August 11, 2017 01:07 PM
టైటానిక్ మరోసారి ప్రేక్షకుల ముందుకు ..!

హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం టైటానిక్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుందా.. అంటే అవుననే అంటున్నాయి ఫిలిం వర్గాలు. సుమారు 105 ఏళ్ళ క్రితం జరిగిన యదార్ధ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన టైటానిక్ చిత్రం విడుదలై ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. అయినప్పటికి ఇది ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంది. అయితే ఈ చిత్రాన్ని డాక్యుమెంటరీగా గా రూపొందించి డిసెంబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు కామెరూన్. నేషనల్ జియోగ్రఫీ ఛానెల్ తో కలిసి టైటానిక్ విషయంలో మరిన్ని పరిశోధనలు జరిపి డాక్యుమెంటరీ ద్వారా కొత్త‌ విషయాలను మన ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నాడట. చూడాలి మరి ఈ సారి డాక్యుమెంటరీతో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో.

1548

More News

VIRAL NEWS