టైగ‌ర్ జిందా హై టైటిల్ సాంగ్ విడుద‌ల‌

Mon,December 18, 2017 11:56 AM
Tiger Zinda Hai title song revealed

స‌ల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన టైగర్ జిందా హై సినిమా క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 22న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్రమాలు జ‌రుపుకొని యూ/ఏ స‌ర్టిఫికెట్ పొందింది. అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర టైటిల్ సాంగ్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. విశాల్ మ‌రియు శేఖ‌ర్ సంగీతం అందించిన ఈ సాంగ్‌ని సుక్వింద‌ర్‌, ర‌ఫ్తార్ పాడారు. 2012 లో కబీర్ ఖాన్ తెరకెక్కించిన 'ఏక్ థా టైగర్' మూవీకి సీక్వెల్ గా టైగర్ జిందా హై చిత్రం తెర‌కెక్కింది. ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్‌ యాక్షన్‌ దర్శకుడు టామ్‌ స్ట్రూథర్స్‌ సల్మాన్‌కు శిక్షణ ఇచ్చారు . సినిమా మొత్తంలో తోడేళ్లతో పోరాట సన్నివేశాలే ఆకర్షణగా నిలుస్తాయని చిత్రవర్గాలు వెల్లడించాయి.

1142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles