మైఖేల్‌ను మ‌రిపించిన‌ టైగ‌ర్ - వీడియా

Thu,August 30, 2018 09:14 AM
Tiger Shroff dances like Michael Jackson

ముంబై: దివంగ‌త పాప్‌స్టార్ మైఖేల్ జాక్స‌న్ అంటే తెలియ‌ని వారుండ‌రు. ఆ డ్యాన్స‌ర్‌ను ప్రేర‌ణ‌గా తీసుకుని అనేక మంది స్టార్లుగా మారారు. మూన్‌వాక‌ర్ స్టెప్పుల‌కు ముగ్దుడ‌వ్వ‌ని అభిమాని లేరు. ఆగ‌స్టు 29వ తేదీన ఎంజే జ‌యంతి జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా బాలీవుడ్ స్టార్ టైగ‌ర్ ష్రాఫ్ త‌నకు ఇష్ట‌మైన ఎంజేను గుర్తు చేసుకున్నాడు. మైఖేల్ జాక్స‌న్‌కు నివాళిగా టైగ‌ర్ కొన్ని స్టెప్పులేశాడు. అద్బుత‌మైన డ్యాన్సింగ్ స్కిల్స్ ఉన్న టైగ‌ర్‌.. అచ్చం ఎంజేలాగే హోరెత్తించాడు. మైఖేల్ పాపుల‌ర్ ట్రాక్‌కు.. బాగీ హీరో డ్యాన్స్ చేశాడు.ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. వైట్ సూట్ వేసుకున్న టైగ‌ర్‌.. త‌న మూవ్స్‌తో ఎంజేను త‌ల‌పించాడు. 1958, ఆగ‌స్టు 29న ఎంజే పుట్టాడు. 2009 జూన్ 25న పాప్‌స్టార్ క‌న్నుమూశారు. స్మూత్ క్రిమిన‌ల్ స్టెప్పులివే..

2662
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles