అలరిస్తున్న బిత్తిరి స‌త్తి 'తుపాకి రాముడు' సాంగ్స్

Tue,September 25, 2018 01:09 PM
Thupaki Ramudu lyrical video songs

తీన్మార్ వార్త‌ల‌తో పాపుల‌ర్ అయిన బిత్తిరి స‌త్తి ఇప్పుడు వెండితెర‌పై క‌థానాయికుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. బతుకమ్మ ఫేమ్ టి. ప్రభాకర్ దర్శక‌త్వంలో తుపాకి రాముడు అనే చిత్రంలో స‌త్తి హీరోగా న‌టిస్తున్నారు. ఈ సినిమా రసమయి ఫిల్మ్స్ పతాకంపై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాణ సార‌థ్యంలో రూపొందుతుంది. చిత్ర మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌ను ఇటీవ‌ల ప్రముఖ దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా విడుదల చేయించ‌గా, సత్తి ఈ సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నాడని అన్నారు.

యూనివర్సల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అల‌రిస్తుంద‌ని ద‌ర్శ‌కుడు అన్నారు. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అంద‌రిని అల‌రిస్తుంద‌ని అంటున్నారు. చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ప్రియ, ఆర్.ఎస్.నందా, గౌతంరాజు, రవి, ఆదేష్, అంబటి వెంకన్న, అనురాగ్ పోశం, మాధవి, గాయత్రి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహ‌కుడిగా సురేందర్‌రెడ్డి ఉన్నారు. మాటలు: సిద్దార్థ, రవి ఆదేష్, ఎడిటింగ్: జె.పి, పాటలు: అభినయ శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మక్కపాటి చంద్రశేఖర్‌రావు, మక్బుల్ హుస్సేన్, నిర్మాత: రసమయి బాలకిషన్, రచన, సంగీతం,దర్శకత్వం: టి.ప్రభాకర్.

8399
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles