తమిళ్, తెలుగులో 'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్'..

Tue,September 25, 2018 02:55 PM
Thugs of hindostan to be release in telugu, tamil

ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్లు అమితాబ్‌బచ్చన్, అమీర్‌ఖాన్ కాంబినేషన్‌లో 'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లోనూ విడుదల కానుంది. బిగ్‌బీ, అమీర్‌ఖాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. 'ప్రేక్షకులు థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లో యూనివర్సల్ కథాంశాన్ని చూస్తారని ఆశిస్తున్నాం. మా సినిమా భారత్‌లో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువకానుంది. ఈ దీపావళి పండుగకు థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ మీ అందరికి కావాల్సిన వినోదాన్ని పంచుతుందని' విజయ్ కృష్ణ ఆచార్య ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈ సినిమాలో తొలిసారి ఆమిర్, అమితాబ్ కలిసి నటించారు. కుదాబక్ష్‌గా అమితాబ్, జఫీరాగా ఫాతిమా సనా షేకర్, సురయ్యాగా కత్రినా కనిపించనున్నారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

1307
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles