‘విశ్వామిత్ర’ రిలీజ్ డేట్ ఫిక్స్

Fri,February 15, 2019 05:15 PM
Thrilling drama 'Vishwamitra' movie release date fixed

హైదరాబాద్: గీతాంజలి, త్రిపుర వంటి హారర్ కామెడీ, థ్రిల్లర్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విశ్వామిత్ర. ప్రేమకథా చిత్రమ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నందితా హీరోయిన్‌గా నటిస్తోంది. మధ్యతరగతి అమ్మాయి పాత్రలో నందితా కనిపిస్తుందని డైరెక్టర్ చెప్పారు. సత్యం రాజేశ్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ముఖ్యపాత్రలు పోషించారు. అమెరికా, న్యూజిలాండ్ దేశాల్లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా బ్యానర్‌పై మాధవి అద్దంకి, రజనీకాంత్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 21న ట్రైలర్.. మార్చి 21న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. హీరోయిన్ నందిత, దర్శకుడు రాజకిరణ్‌కు విజయాలు అందించిన జానర్‌లో వస్తోన్న విశ్వామిత్ర ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రబృందం భావిస్తోంది.

1286
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles