బీచ్ రోడ్‌లో సినీహీరో విగ్ర‌హాల తొల‌గింపు

Tue,May 14, 2019 01:11 PM
Three statues of telugu film heroes removed from Vizag beach road

హైద‌రాబాద్‌: వైజాగ్ బీచ్ రోడ్డులో ఉన్న సినీ హీరోల విగ్ర‌హాల‌ను రాత్రికి రాత్రే తొల‌గించారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర్ రావు, డైర‌క్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు, ఎన్టీఆర్ కుమారుడు హ‌రికృష్ణ విగ్ర‌హాల‌ను అక‌స్మాత్తుగా తొల‌గించారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేర‌కు విగ్ర‌హాల తొల‌గింపు జ‌రిగింది. సామాజిక కార్య‌క‌ర్త బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ వేసిన పిటిష‌న్ ఆధారంగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. తెలుగు దేశం పార్టీకి చెందిన రాజ‌కీయ నాయ‌కులు రాత్రికి రాత్రే సినీహీరోల విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు పిటిషన‌ర్ వాదించాడు. వైజాగ్ మున్సిప‌ల్ క‌మిటీ నుంచి అనుమ‌తి తీసుకోకుండానే విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేశార‌ని క‌మిష‌న‌ర్ హ‌రినారాయ‌ణ‌న్ తెలిపారు. ఇవాళ ఉద‌యం కొంద‌రు టీడీపీ నేత‌లు విగ్ర‌హాల ముందు ధ‌ర్నా చేశారు.

2374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles