వ‌చ్చే వారం ముచ్చ‌ట‌గా మూడు సినిమాల మ‌ధ్య ఫైట్..!

Sun,July 15, 2018 12:18 PM
three movies big fight on box office

టాలీవుడ్‌లో ఈ వారం విడుద‌లైన విజేత‌, చిన బాబు, ఆర్ ఎక్స్ 100 చిత్రాలు మంచి టాక్ సంపాదించుకున్నాయి. మూడు చిత్రాలు విభిన్న క‌థ‌ల‌తో రూపొంద‌గా, వాటికి ప్రేక్ష‌కులు నీరాజ‌నం ప‌లికారు. ఇక వ‌చ్చే వారం విడుద‌ల‌య్యే సినిమాలు ఏంటా అని జ‌నాలు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ముచ్చ‌ట‌గా మూడు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డేందుకు సిద్ధం కాగా, ఇందులో దిల్ రాజు నిర్మించిన ల‌వ‌ర్‌, మంచు ల‌క్ష్మీ వైఫ్ ఆఫ్ రామ్‌, ఆట‌గ‌ద‌రా శివ చిత్రాలు ఉన్నాయి. రీసెంట్‌గా ఆట‌గ‌ద‌రా శివ చిత్ర సాంగ్‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ విడుద‌ల చేయ‌డంతో ఈ సినిమా అంచ‌నాలు పెరిగాయి.

ల‌వ‌ర్ చిత్రం రాజ్ త‌రుణ్‌, రిద్ది కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్క‌గా, రీసెంట్‌గా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇది అభిమానుల‌లో ఆస‌క్తి క‌లిగిస్తుంది. జూలై 20న విడుద‌ల కానున్న ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుందని టీం భావిస్తుంది. విజ‌య్ ఏల‌కంటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన వైఫ్ ఆఫ్ రామ్ కూడా జూలై 20న విడుద‌ల కానుంది. మంచు ల‌క్ష్మీ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నుంద‌ని అంటున్నారు. ఇక చంద్ర సిద్ధార్ధ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆట‌గ‌ద‌రా శివ కూడా జూలై 20నే రిలీజ్ అవుతుంది. రాక్ లైన్ వెంక‌టేష్ నిర్మించిన ఈ చిత్ర ట్రైల‌ర్, సాంగ్స్‌ని బ‌ట్టి చూస్తుంటే ఇది కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని జ‌నాలు అంటున్నారు. మ‌రి ఈ మూడు సినిమాల‌లో ఏ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అతి పెద్ద విజ‌యం సాధిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

2221
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS