డిసెంబ‌ర్‌లో బాక్సాఫీస్‌ని రూల్ చేయ‌నున్న బాల‌య్య‌!

Thu,November 21, 2019 08:13 AM

కొన్ని సంవ‌త్స‌రాల నుండి టాలీవుడ్‌లో నవంబ‌ర్ నెల చాలా డ్రైగా ఉంటుంది. పెద్ద సినిమాలేవి ఆ నెల‌లో రిలీజ్ కాక‌పోవ‌డంతో చిన్న సినిమాల సంద‌డి మాత్ర‌మే ఉంటుంది. అయితే ఈ సారి కూడా నవంబ‌ర్‌లో ఒక్క మంచి సినిమా కూడా విడుద‌ల కాక‌పోగా, డిసెంబ‌ర్‌లో మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మూడు సినిమాలు పోటీ ప‌డేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా ఈ మూడింట్లో చెప్పుకోవ‌ల‌సింది బాల‌కృష్ణ న‌టిస్తున్న రూల‌ర్ చిత్రం గురించి. కేఎస్ రవికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాల‌య్య స‌రికొత్త‌గా క‌నిపిస్తుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.


కొన్నాళ్ళుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా హీరో సాయిధ‌రమ్ తేజ్ తాజాగా ప్ర‌తిరోజూ పండగే అనే చిత్రం చేశాడు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల‌కి వినోదాన్ని అందిస్తుంద‌ని అంటున్నారు. ఇక దిల్ రాజు నిర్మాణంలో రాజ్ త‌రుణ్ హీరోగా ఇద్ద‌రి లోకం ఒక్క‌టే సినిమా రూపొందింది. ఈ చిత్రంపై కూడా అంచ‌నాలు ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 20న విడుద‌ల కానున్నాయి. ఈ మూడింటిలో అందరి దృష్టి బాల‌య్య రూల‌ర్‌పైనే ఉంది. బాక్సాఫీస్‌ని బాల‌య్య త‌ప్ప‌క రూల్ చేస్తాడ‌ని ఆయ‌న అభిమానులు చెప్పుకుంటున్నారు.

838
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles